Afghanistan: తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అతిథులుగా పాక్‌, చైనా

తాజా వార్తలు

Published : 07/09/2021 01:18 IST

Afghanistan: తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అతిథులుగా పాక్‌, చైనా

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. తాజాగా పంజ్‌షేర్‌ లోయను కూడా సంపూర్ణంగా హస్తగతం చేసుకొన్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి అతిథులుగా.. పాకిస్థాన్‌, చైనా, టర్కీ, కతర్‌, రష్యా, ఇరాన్‌ దేశాలకు తాలిబన్లు ఆహ్వానం పంపినట్లు సమాచారం. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌ నుంచి అనేక దేశాల రాయబార కార్యాలయ అధికారులు స్వదేశాలకు వెళ్లిపోయారు. కాగా ఇప్పటికీ అక్కడ రాయబార కార్యాలయాలు నిర్వహిస్తున్న అతి తక్కువ దేశాల్లో చైనా, పాకిస్థాన్‌, రష్యా ఉన్నాయి.

కాబుల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ యుద్ధం ముగిసిందని పేర్కొన్నారు. ‘యుద్ధం ముగిసింది. ఇప్పుడు పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి. ఇతరులు మన దేశాన్ని పునఃనిర్మించలేరనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఆ పని చేయాల్సిన బాధ్యత మన దేశ ప్రజలమీదే ఉంది’ అని ముజాహిద్‌ పేర్కొన్నారు. కతర్‌, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు కాబుల్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు తాలిబన్లను సమర్థంగా ఎదుర్కొన్న రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ వారికి తలొగ్గినట్లే కనిపిస్తోంది.  పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకొన్నట్లు తాలిబన్లు సోమవారం ప్రకటించారు. పంజ్‌షేర్‌ గవర్నర్‌ కార్యాలయంపై తమ జెండాను ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాక్‌ మద్ధతుతోనే అక్కడ తాలిబన్లు విజయం సాధించినట్లు తెలుస్తోంది. పాక్‌ డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో పంజ్‌షేర్ ప్రాంతంపై తాలిబన్లు దాడికి పాల్పడినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని