Taliban leaders head to presidential palace: అఫ్గాన్‌ పాలన తాలిబన్ల హస్తగతం!

తాజా వార్తలు

Updated : 16/08/2021 09:11 IST

Taliban leaders head to presidential palace: అఫ్గాన్‌ పాలన తాలిబన్ల హస్తగతం!

ఇంటర్నెట్‌డెస్క్‌: కాబూల్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నేటి ఉదయం తాలిబన్లు నగర శివార్లలోకి, అక్కడి నుంచి నగరంలోకి ప్రవేశించారు. దీంతో అఫ్గాన్‌ రాజధాని వారి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. తాలిబన్లు శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం దేశ అధ్యక్షుడి బంగ్లాకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల వార్తా సంస్థ ధ్రువీకరించింది. ప్రస్తుతం దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్‌ సత్తార్‌ మిర్జక్వాల్‌ మాట్లాడుతూ అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు టోలో న్యూస్‌ వెల్లడించింది. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పినట్లు డెయిలీ న్యూస్‌ ఈజిప్ట్‌ పత్రిక పేర్కొంది.

ఆదివారం తాలిబన్‌ నాయకులు మాట్లాడుతూ తాము కాబూల్‌ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం లేదని హామీ ఇచ్చారు. కాబూల్‌ వాసులు ఎటువంటి భయభ్రాంతులకు గురికావద్దని పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి నగరంలోని ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం తమకు లేదని వారు పలు వార్తా సంస్థలకు వెల్లడించారు.  

‘‘అన్ని దళాలకు ది ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఒక విషయం చెబుతోంది. మీరు కాబూల్‌లోకి ప్రవేశించే మార్గాల వద్దే ఆగిపోండి. ఎవరూ నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయవద్దు’’ అంటూ ఉదయం తాలిబన్‌ ప్రతినిధి ట్వీట్‌ చేశారు. కానీ, కొందరు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించారని స్థానికులు చెబుతున్నారు. మరోపక్క రష్యా మాత్రం తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి జమీర్‌ కబులోవ్‌ పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని