Taliban: మహిళా సంక్షేమం లేదు.. మహిళా మంత్రుల్లేరు..!

తాజా వార్తలు

Published : 21/09/2021 14:43 IST

Taliban: మహిళా సంక్షేమం లేదు.. మహిళా మంత్రుల్లేరు..!

తాలిబన్ల కేబినెట్‌ విస్తరణ.. మహిళలకు దక్కని చోటు

కాబుల్‌: అంతర్జాతీయ సమాజం విమర్శలను తాలిబన్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ అరాచక ధోరణి కొనసాగిస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ఇప్పటికే మహిళా మంత్రిత్వ శాఖకు తిలోదకాలిచ్చిన తాలిబన్లు.. మంత్రి మండలిలోనూ మహిళలకు చోటు కల్పించడం లేదు. ఇటీవల తాత్కాలిక కేబినెట్‌ను ఏర్పాటు చేసిన తాలిబన్లు.. తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. డిప్యూటీ మంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఒక్క మహిళ కూడా లేదు. అయితే ఇది కేవలం తాత్కాలిక కేబినెట్‌ మాత్రమేనని, భవిష్యత్తులో మార్పులు జరుగుతాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ చెప్పడం గమనార్హం.  

మహిళలకు మంత్రిపదవులు అవసరం లేదని, వాళ్లు పిల్లల్ని కంటే చాలని ఇప్పటికే తాలిబన్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకే కేబినెట్‌లో మహిళా మంత్రిత్వశాఖను కూడా ఎత్తేశారు. ఆ శాఖకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకుని అందులో కొత్తగా ప్రకటించిన ధర్మ ప్రచార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కన్పించట్లేదు. 

వీలైనంత త్వరగా బాలికలు కూడా స్కూళ్లకు..

తాలిబన్ల పాలన మొదలైన తర్వాత మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వారిని విద్యకు, ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు. ఇప్పటికే ఆరు నుంచి 12వ తరగతి చదివే బాలురు స్కూళ్లకు వెళ్తుండగా.. బాలికలకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీనిపై ముజాహిద్‌ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  అయితే దానికంటే ముందు ‘భద్రమైన వాతావరణం’ ఏర్పాటు చేయాలి కదా అని చెప్పుకొచ్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని