Corona: మరోసారి 40వేలపైనే కొత్తకేసులు 

తాజా వార్తలు

Published : 22/07/2021 09:42 IST

Corona: మరోసారి 40వేలపైనే కొత్తకేసులు 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటుండం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.18లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 41,383 మందికి పాజిటివ్‌గా తేలింది. కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో 38,652 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.04కోట్లకు చేరగా... రికవరీ రేటు 97.35శాతంగా ఉంది.

ఇక 24 గంటల వ్యవధిలో మరో 507 మందిని కరోనా బలితీసుకుంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.18లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. మరణాలు రేటు 1.34శాతంగా ఉంది. అయితే, యాక్టివ్‌ కేసులు ఐదు లక్షలకు దిగువనే ఉండటం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,09,394 మంది కరోనాతో బాధపడుతున్నారు.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం కలవరపెడుతోంది. నిన్న కేవలం 22.77లక్షల మందికి మాత్రమే టీకాలు అందించగలిగారు. ఇప్పటి వరకు మొత్తంగా 41.78లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని