Portraits tribute: ఇల్లాలి స్మృతికి చిత్తరువుల నివాళి..

తాజా వార్తలు

Updated : 01/09/2021 15:17 IST

Portraits tribute: ఇల్లాలి స్మృతికి చిత్తరువుల నివాళి..

తల్లిలా ఏడాది పాప పోజు

లాస్‌ ఏంజెలెస్‌: కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజెలెస్‌ సమీప అనహైం పట్టణమది. ఏడాది కిందట తాగి కారు నడుపుతున్న వ్యక్తి తప్పిదానికి.. ఎసెనియా అగిలార్‌ అనే నిండుగర్భిణి బలైంది. 35 వారాల గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆమె కడుపులోని బిడ్డను మాత్రం సురక్షితంగా తండ్రి జేమ్స్‌ అల్వారెజ్‌ (37) చేతుల్లో పెట్టారు. ఏడాది వయసొచ్చిన అడలిన్‌ తొలి పుట్టినరోజు వచ్చింది. ఇల్లాలి జ్ఞాపకాల్లోంచి ఇంకా తేరుకోని జేమ్స్‌ అదేరోజున తనకు దూరమైన అగిలార్‌కు నివాళి, చిన్నారి తనయ అడలిన్‌ పుట్టినరోజు రెండూ కలిపి చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ చిత్రాలు చూసిన నెటిజన్లు కన్నీటితో స్పందిస్తున్నారు. ‘నేను ఏడుపు ఆపుకోలేకపోతున్నా’ అంటూ ఒకరంటే.. ‘నా హృదయం ద్రవించుకుపోతోంది’ అంటూ మరొకరు. ఇంతకూ జేమ్స్‌ ఏం చేశాడంటే.. ఏడాది కిందట తన ఇల్లాలితో ఏయే ప్రాంతాల్లో, ఎలా మెటర్నిటీ ఫొటోషూట్‌ (నిండుగర్భంతో ఉండగా తీసిన చిత్రాలు) చేశాడో.. సరిగ్గా అలాగే తన చిన్నారి కుమార్తెను నిలిపి చిత్రాల పునఃసృష్టి (రీ క్రియేషన్‌) చేశాడు. బొద్దుగా.. ముద్దుగా ఉన్న అడలిన్‌ తల్లిలాగే గులాబీరంగు దుస్తులు ధరించి ఫొటోలకు పోజిచ్చింది. వందశాతం ఒకేలా ఉన్న నాటి.. నేటి చిత్రాలు చూసినవాళ్లు ఇల్లాలిపై జేమ్స్‌కు ఉన్న ప్రేమ, గౌరవాన్ని అభినందిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని