Amrullah Saleh: సూపర్ పవర్‌.. మినీ పవర్‌గా ఉండాలనుకుంది.. ఏం చేస్తాం!

తాజా వార్తలు

Published : 01/09/2021 01:18 IST

Amrullah Saleh: సూపర్ పవర్‌.. మినీ పవర్‌గా ఉండాలనుకుంది.. ఏం చేస్తాం!

మా దేశం ఇక్కడే ఉందన్న అమ్రుల్లా

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో అమెరికా సుదీర్ఘ యుద్ధాన్ని ముగించి అఫ్గాన్ వీడుతున్న చివరి సైనికుడి ఫొటోను అగ్రదేశం విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ దేశ అపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ స్పందించారు. ఆ ఆఖరి సైనికుడి సంచిలో దేశాన్ని ప్యాక్ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. 

‘చిట్టచివరి అమెరికా సైనికుడి సంచిలో అఫ్గానిస్థాన్‌ను ప్యాక్‌ చేసి పెట్టలేదు. దేశం ఇక్కడే ఉంది. నదులు ప్రవహిస్తున్నాయి. పర్వతాలు అద్భుతంగా ఉన్నాయి. తాలిబన్లు ప్రజాదరణ లేని శక్తులు. ఈ దేశం మొత్తం వారినుంచి తప్పించుకోవాలని చూస్తోంది. ఒక సూపర్ పవర్.. మినీ పవర్‌గా ఉండాలని నిర్ణయించుకుంది. అది ఓకే’ అంటూ అమ్రుల్లా అమెరికా వైఖరిని తప్పుపట్టారు. 

తాలిబన్ల దురాక్రమణ అనంతరం అమ్రుల్లా తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. పంజ్‌షిర్ దళాలతో చేరారు. అలాగే తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లు గతంలో వెల్లడించారు. అర్థవంతమైన చర్చలను మాత్రమే ఆమోదిస్తామన్నారు. అఫ్గాన్‌ను తాలిబానిస్థాన్‌ కానీయమని స్పష్టం చేశారు. ‘మేం పదవులు అడగడం లేదు. అఫ్గాన్‌ ప్రజలకు వారి దేశం ఎలా ఉండాలో ఎంచుకునే హక్కు ఉంది. వారి వ్యక్తిగత గుర్తింపు కోల్పోవడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు’ అన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని