Corona: ఒకే వ్యక్తి.. ఒకేసారి రెండు వేరియంట్లు

తాజా వార్తలు

Published : 20/07/2021 11:35 IST

Corona: ఒకే వ్యక్తి.. ఒకేసారి రెండు వేరియంట్లు

భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు

దిస్‌పూర్‌: కరోనా వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకొస్తోన్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన భారత్‌లో వెలుగుచూసింది. అస్సాంలోని ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు నమూనా పరీక్షల్లో నిర్ధారణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు.

దీనిపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన అధికారి విశ్వజ్యోతి బొర్కాకొటి మీడియాతో మాట్లాడారు. అస్సాంకు చెందిన మహిళా వైద్యురాలు ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు గుర్తించామన్నారు. ‘ఆమె నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించాం. ఈ డబుల్‌ ఇన్ఫెక్షన్‌పై స్పష్టత కోసం మరోసారి నమూనాలను సేకరించి, పరీక్షించాం. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధారించుకున్నాం. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు’ అని వెల్లడించారు. అయితే ఆ వైద్యురాలు టీకా రెండు డోసులు వేయించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఈ డబుల్ ఇన్ఫెక్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆమెలో ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లను గుర్తించారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ వృద్ధురాలు అసలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలియజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని