Taliban: బైడెన్‌ తప్పుమీద తప్పు..  తాలిబన్లు వెతుకుతున్న జాబితా చేతికిచ్చిన అమెరికా

తాజా వార్తలు

Updated : 27/08/2021 19:10 IST

Taliban: బైడెన్‌ తప్పుమీద తప్పు..  తాలిబన్లు వెతుకుతున్న జాబితా చేతికిచ్చిన అమెరికా

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గాన్‌ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెన్‌ సర్కారు చేస్తోన్న  తప్పులకు అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు న్యూయార్క్‌ పోస్టు పత్రిక వెలుగులోకి తెచ్చింది. అఫ్గానిస్థాన్‌లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికిచ్చినట్లు  పేర్కొంది. ఇప్పుడు తాలిబన్లు ఆ జాబితా ఆధారంగా హిట్‌లిస్టు రూపొందించుకుని వారి కోసం వెతుకుతున్నారు. శ్వేత సౌధం బ్రీఫింగ్‌ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే.. ‘జరిగి ఉండొచ్చు’ అనే సమాధానం వచ్చింది.

ఎలా జరిగింది..?

ఆగస్టు 15న కాబుల్‌ ఆక్రమణ తర్వాత అమెరికా అధికారులు తాలిబన్లకు ఒక జాబితా ఇచ్చారు. దీనిలో అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్‌ లభించిన వారు, అఫ్గాన్‌లో మిత్రులు ఉన్నారని.. వారిని విమానాశ్రయంలోకి అనుమతించాలని తాలిబన్లకు సూచించారు. తాలిబన్లు ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే.

గతంలో అమెరికాకు సాయం చేసిన వారిని క్రూరంగా చంపిన చరిత్ర తాలిబన్లకు ఉంది. ఈ నేపథ్యంలో చివరి సమయంలో తాలిబన్లను గుడ్డిగా నమ్మి ఈ జాబితాను అప్పజెప్పింది.

కాబుల్‌ విమానాశ్రయంపై దాడి అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బైడెన్‌ ఇటువంటి జాబితాను అసలు అప్పజెప్పలేదని కచ్చితంగా చెప్పలేకపోయారు. విమానాశ్రయానికి వచ్చే సమయంలో తమ వారిని లోపలకి వదలమని చెప్పి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తాలిబన్లు ఇంటింటికీ వెళ్లి వెతుకుతూ..

తాలిబన్లు అమెరికాకు సాయం చేసిన వారిని పట్టుకొనేందుకు ఇంటింటికీ వెళ్లి సోదాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అమెరికాకు వివిధ దశల్లో సాయం చేసిన వేలమంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.

అమెరికా వీసా కోసం అప్లై చేసిన చాలా మంది.. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించాక విమానాశ్రయం చేరుకున్నారు. దీంతో అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వారిని కొన్నాళ్లు వేచి ఉండమని పేర్కొంది. ఇప్పటికే వారు తాలిబన్లకు ఇచ్చిన జాబితాలను క్లియర్‌ చేసేదాకా కొత్తవారి పేర్లను తరలించేవారి జాబితాలో చేర్చమని చెప్పింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని