Britain: తాలిబన్లను వారి మాటల ద్వారా కాదు..చర్యలను బట్టి అంచనా వేయాలి

తాజా వార్తలు

Published : 18/08/2021 19:46 IST

Britain: తాలిబన్లను వారి మాటల ద్వారా కాదు..చర్యలను బట్టి అంచనా వేయాలి

లండన్: అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో రెండువేల మందికి పైగా అఫ్గాన్లు దేశం వీడేందుకు సహకరించామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. అలాగే తాలిబన్లను మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా అంచనా వేయాలని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు. 

క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని జాన్సన్ వెల్లడించారు. దానిలో భాగంగా ఇప్పటివరకు 306 మంది బ్రిటన్‌ జాతీయుల్ని, 2,052 మంది అఫ్గాన్ వాసుల్ని తమ ప్రభుత్వం సురక్షితంగా తరలించిందని వెల్లడించారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా ఇంకా పలు దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేశామన్నారు. మిగతావాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అఫ్గాన్లు దేశం దాటాలని ప్రయత్నిస్తోన్న తరుణంలో మంగళవారం రాత్రి బ్రిటన్ ప్రభుత్వం ఈ పునరావాస పథకాన్ని ప్రకటించింది. దాని కింద మొదటగా ఐదువేల మందికి పునరావాసం కల్పించనుంది. అక్కడి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఆ సంఖ్యను 20 వేలకు పెంచింది. దీనికింద అత్యంత ప్రమాదంలో ఉన్న వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యం అని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని