Corona Update: స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు!

తాజా వార్తలు

Updated : 29/08/2021 11:48 IST

Corona Update: స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు!

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య శనివారంతో పోలిస్తే కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 45,083 కొత్త కేసులు బయటపడగా.. 460 మంది కొవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,9030కి పెరగ్గా.. కొవిడ్‌ బారిన పడి ఇంతవరకు 4,37,830 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు ఒక్కరోజులో 8,783 పెరిగాయి. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 3,68,558 (1.13%)కి చేరింది. బాధితుల్లో 3,18,88,642 (97.53%) మంది కోలుకున్నారు. వారం వారీగా వైరస్‌ పాజిటివిటీ రేటు 2.28%గా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.57%కు పెరిగింది.

* మరోవైపు కేరళలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఒక్కరోజులో 31,265 కేసులు.. 153 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 30 వేలకు పైగా కేసులు నమోదుకావడం వరుసగా ఇది నాలుగోరోజు కావడం గమనార్హం.

* దిల్లీలో కొత్తగా 61 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్క మరణం కూడా నమోదుకాకపోవడం విశేషం.

* గత 24 గంటల వ్యవధిలో 73.8 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 63.09 కోట్లకు చేరింది.

* అమెరికాలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 1,300 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రధానంగా ఫ్లోరిడాలో మరణాలు పెరుగుతున్నాయి.

* ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూడడంతో విధించిన 4 వారాల లాక్‌డౌన్‌ వచ్చే గురువారంతో ముగుస్తున్నప్పటికీ.. దీన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని