Corona: ఒకరిలో రెండు వేరియంట్లు

తాజా వార్తలు

Published : 21/07/2021 10:55 IST

Corona: ఒకరిలో రెండు వేరియంట్లు

 అస్సాం వైద్యురాలికి ఆల్ఫా, డెల్టా..

గువాహటి: కరోనా వైరస్‌లో కొత్త రకాలు (వేరియంట్లు) పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. ఒకరికే రెండు వైరస్‌ రకాలు సోకిన అత్యంత అరుదైన కేసు భారత్‌లో వెలుగు చూసింది. ఈమేరకు అస్సాంలో ఓ మహిళా డాక్టర్‌కు ఒకేసారి కరోనా వైరస్‌ (సార్స్‌-కోవ్‌-2) ఆల్ఫా, డెల్టా రకాలు సోకాయి. ఈ విషయాన్ని లాహొవాల్‌ ఐసీఎంఆర్‌ ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం నోడల్‌ అధికారి డాక్టర్‌ బిశ్వజ్యోతి బొర్కాకొటీ ధ్రువీకరించారు. దేశంలోనే ఇలాంటి కేసు ఇదే తొలిసారి కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సంబంధిత మహిళా డాక్టర్‌ శాంపిళ్లను పరీక్షించామని.. ఆమెలో ఒకేసారి ఆల్ఫా, డెల్టా రకాలను కనుగొన్నట్లు బొర్కాకొటీ చెప్పారు. దీంతో మరోసారి నిర్ధారించేందుకు గాను ఆమె శాంపిళ్లను రెండోసారి కూడా పరీక్షించినప్పటికీ అదే విషయం తేలినట్లు వెల్లడించారు. ఆమె భర్తకు కూడా కొవిడ్‌ సోకిందని.. ఆయనలో ఆల్ఫా రకాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఆమె రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నట్లు వెల్లడించారు. ఆమెలో స్వల్ప లక్షణాలే కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం రాలేదని వివరించారు. కాగా గతంలో బెల్జియంలో ఓ వృద్ధురాలి (90)లో ఒకేసారి ఆల్ఫా, బీటా వైరస్‌ రకాలు కనిపించాయి. ఆమెకు వ్యాక్సినేషన్‌ కాకపోగా.. ఈ ఏడాది మార్చిలో ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని