Vaccine: టీకా తీసుకుంటే.. వైరస్‌ ముప్పు 3రెట్లు తగ్గినట్లే..!

తాజా వార్తలు

Published : 04/08/2021 17:24 IST

Vaccine: టీకా తీసుకుంటే.. వైరస్‌ ముప్పు 3రెట్లు తగ్గినట్లే..!

టీకా తీసుకోని వారికి వైరస్‌ ముప్పు అధికమన్న నిపుణులు

లండన్‌: వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి మాత్రం ఆగడం లేదు. కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ కొరత ఎదుర్కొంటుండగా.. మరికొన్ని దేశాల ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వైరస్‌ నుంచి మూడో వంతు ముప్పు తప్పినట్లేనని బ్రిటన్‌ పరిశోధకులు పేర్కొన్నారు. లక్షణాలు కనిపించనప్పటికీ డెల్టా వేరియంట్‌ వంటి కొత్తరకాల నుంచి రక్షణ పొందవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు జూన్‌ 24 నుంచి జులై 12 మధ్యకాలంలో ఓ అధ్యయనం జరిపారు. దాదాపు 98వేల మందిపై అధ్యయనం చేపట్టగా.. ఇందులో రెండు డోసులు తీసుకున్న వారిలో సగం మందికి మాత్రమే వైరస్‌ బారినపడే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించినవారిలోనూ వైరస్‌ను ఎదుర్కొనే సమర్థత 59శాతం పెరిగినట్లు కనుగొన్నారు. ఇక పాజిటివ్‌ వచ్చిన వాటిలో 254 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేపట్టగా.. వాటిలో ఎక్కువగా డెల్టా వేరియంట్‌వే ఉన్నట్లు లండన్‌ పరిశోధకులు పేర్కొన్నారు.

టీకా తీసుకున్న వారిలో వైరల్‌ లోడ్‌ తక్కువే..

వ్యాక్సిన్‌ తీసుకోని యువకుల్లో ఇన్‌ఫెక్షన్‌లు, ఆస్పత్రి చేరికలకూ ఉన్న సంబంధాన్ని తాజా అధ్యయనంలో నిపుణులు గుర్తించారు. గతంలో వైరస్‌ సోకిన వారికి డెల్టా వేరియంట్‌ తోడై మరోసారి వ్యాప్తి చెందే ప్రభావం ఉందని కనుగొన్నారు.  అయినప్పటికీ వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి 120 మందిలో ఒకరికి వైరస్‌ సోకగా.. వ్యాక్సిన్‌ తీసుకోని ప్రతి 40మందిలో ఒకరికి వైరస్‌ సోకుతున్నట్లు గుర్తించారు. అనగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వైరస్‌ ప్రాబల్యం 0.40శాతం ఉండగా.. తీసుకోని వారిలో ఇది 1.21శాతం ఉందని లెక్కకట్టారు. అంతేకాకుండా టీకా పొందిన తర్వాత వైరస్‌ బారినపడిన  బాధితుల్లో వైరల్‌ లోడ్‌ తక్కువగానే ఉన్నట్లు లండన్‌ పరిశోధకులు స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని