Center: మీరు ఈ యువరాజు గురించి తెలుసుకోవాలి..!

తాజా వార్తలు

Published : 21/07/2021 13:42 IST

Center: మీరు ఈ యువరాజు గురించి తెలుసుకోవాలి..!

ఇటాలియన్ భాషలో రాహుల్‌కు కేంద్రమంత్రి కౌంటర్

దిల్లీ: కరోనా రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా బాధితులెవరూ మృతి చెందలేదని కేంద్రం చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తిప్పికొట్టారు. రాహుల్‌కు ఇటలీభాషలో బదులిచ్చారు. 

రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్ అందక కొవిడ్ బాధితులు మృతి చెందినట్లు రాష్ట్రాలు చెప్పలేదని కేంద్రం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఇలాంటి మరణాలు చోటుచేసుకున్నట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలేవీ నివేదించలేదని పేర్కొంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ‘ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం ఒక్కటే సమస్య కాదు. అప్పుడూ, ఇప్పుడూ.. సున్నితత్వం, వాస్తవాలకు సంబంధించి తీవ్రమైన కొరత ఉంది’ అంటూ కేంద్రం ఇచ్చిన సమాధానంపై విరుచుకుపడ్డారు. దీనిపై గిరిరాజ్ సింగ్ ఇటాలియన్ భాషలో బదులిచ్చారు. ‘నేను ఈ యువరాజు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయనకు అప్పుడు మెదడు లేదు. ఇప్పుడు దాన్ని కోల్పోయారు. ఇక ఎప్పటికీ అదే పరిస్థితి. ఇవి రాష్ట్రాలు సిద్ధం చేసిన జాబితాలు. సవరించిన జాబితాలను సమర్పించమని మీ పార్టీ పాలించే రాష్ట్రాలకు మీరు చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అబద్ధాలు మానుకోండి’ అంటూ రాహుల్‌కు కౌంటర్ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా, నిన్న రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానమిస్తూ..‘కొవిడ్ మరణాలను గుర్తించే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రాలు ఇస్తున్న లెక్కల్నే కేంద్రం క్రోడీకరిస్తోంది. ఆ విషయంలో మా పాత్ర అంతవరకే. మరణాలను, కేసుల్ని తగ్గించి చూపాల్సిందిగా మేం ఎవరికీ చెప్పలేదు. అలాంటి అవసరమే లేదు’ అని స్పష్టం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని