IIT Madras: ఉత్తమ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌ టాప్‌!

తాజా వార్తలు

Updated : 09/09/2021 16:54 IST

IIT Madras: ఉత్తమ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌ టాప్‌!

NIRF ర్యాంకింగ్స్‌ను ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

దిల్లీ: దేశంలో ఉత్తమ యూనివర్సిటీ జాబితాల్లో ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF) 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్‌ టాప్‌ స్థానంలో నిలిచింది. అన్ని విభాగాలతో పాటు ఇంజినీరింగ్‌ కేటగిరీలోనూ తొలిస్థానం సాధించింది. ఐఐటీ మద్రాస్‌ ఈ ఘనతను సాధించడం వరుసగా ఇది మూడోసారి. 

ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో స్థానాన్ని పదిలపరచుకోగా ఐఐటీ బాంబే మూడో స్థానంలో నిలిచింది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలకు తొలి పది స్థానాల్లో చోటు లభించింది. తాజాగా వెల్లడైన ఏన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ను వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని