India Corona: మరోసారి తగ్గిన కేసులు..200కు దిగొచ్చిన మరణాలు

తాజా వార్తలు

Updated : 13/09/2021 11:53 IST

India Corona: మరోసారి తగ్గిన కేసులు..200కు దిగొచ్చిన మరణాలు

74 కోట్ల టీకా డోసుల పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 12,08,247 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 27,254 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 4.6 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో మరణాల సంఖ్య మరోసారి 200కు దిగొచ్చింది. నిన్న 219 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.32 కోట్ల మంది వైరస్‌ బారిన పడగా.. ఇప్పటివరకు 4.42 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

నిన్న 37,687 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.24 కోట్ల మందికి పైగా వైరస్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,74,269 మంది మహమ్మారితో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.13 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 53,38,945 మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 74,38,37,643కి చేరింది.  



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని