India Corona: దేశంలో కరోనా.. సానుకూలంగా గణాంకాలు..!

తాజా వార్తలు

Published : 11/10/2021 09:55 IST

India Corona: దేశంలో కరోనా.. సానుకూలంగా గణాంకాలు..!

ఏడు నెలల కనిష్టానికి కొత్త కేసులు.. 98 శాతానికి పెరిగిన రికవరీ రేటు 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, క్రియాశీల కేసుల సంఖ్య ఊరటనిస్తోంది. కొత్త కేసులు మార్చి ప్రారంభం నాటి స్థాయికి తగ్గగా.. క్రియాశీల కేసులు 209 రోజుల కనిష్టానికి పడిపోయాయి. ఇక రికవరీ రేటు 98 శాతానికి పెరిగింది. సోమవారం కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు సానుకూలంగా కనిపించాయి. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తుండటంతో మహమ్మారి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆదివారం 10,35,797 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,132 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అలాగే నిన్న 21,563 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. రికవరీలు 3.32 కోట్లు(98 శాతం)గా ఉన్నాయి. నిన్న నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తక్కువగా ఉండటం గమనార్హం. 

కొత్త కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం 2,27,347 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఆ కేసుల రేటు 0.67 శాతానికి చేరింది. మరోపక్క మరణాలు కూడా 200 దిగువన నమోదయ్యాయి. నిన్న 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,50,782కి చేరింది. ఇక నిన్న 46,57,679 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 95 కోట్ల మార్కును దాటింది. దసరా లోపు 100 కోట్ల మార్కుకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని