Vaccination: వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్.. రోజువారీ సగటులో 18 దేశాల కంటే ముందు..!

తాజా వార్తలు

Published : 16/09/2021 17:34 IST

Vaccination: వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్.. రోజువారీ సగటులో 18 దేశాల కంటే ముందు..!

దిల్లీ: గత కొద్ది రోజులుగా కరోనా టీకా కార్యక్రమంలో భారత్ వేగం చూపిస్తోంది. ఇప్పటివరకు 76 కోట్లకుపైగా టీకా డోసుల్ని పంపిణీ చేసింది. ఈ క్రమంలో రికార్డులు నమోదుచేస్తోంది. డోసుల పంపిణీలో మనదేశ రోజువారీ సగటు.. 18 పెద్ద దేశాల సగటు కంటే ఎక్కువని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ప్రకటన చేసింది. 

ప్రపంచంలోని 18 ప్రధాన దేశాలు 81,70,000 డోసుల కొవిడ్ టీకాలు వేయగా.. భారత్ 85,40,000 టీకా డోసుల్ని పంపిణీ చేసిందని తెలిపింది. జపాన్, యూఎస్‌, యూకే, కెనడా, రష్యా.. ఆ దేశాల జాబితాలో ఉండటం గమనార్హం. 

81 రోజులుగా 50 వేల దిగువనే కేసులు..

మరోపక్క గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గిన కరోనా కొత్త కేసులు తాజాగా పెరిగాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు కేంద్రం ఈ రోజు ఉదయం గణాంకాలను విడుదల చేసింది. 30 వేల కేసులు, 400కు పైగా మరణాలు సంభవించాయని తెలిపింది. కేరళలోనే సగానికి పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే దేశంలో వరుసగా 81 రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే విషయం.

మరోపక్క 34 జిల్లాల్లో వారపు సగటు పాజిటివిటీ రేటు 10 శాతం పైనే ఉంది. 32 జిల్లాల్లో ఆ రేటు 5 నుంచి 10 శాతం మధ్యలో నమోదవుతోంది. ప్రస్తుతం 3.42 లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.    


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని