Landslides: వాహనాలపై విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న 40 మంది?

తాజా వార్తలు

Updated : 11/08/2021 16:52 IST

Landslides: వాహనాలపై విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న 40 మంది?

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్‌ జిల్లాలోని రెకాంగ్‌ పియో - సిమ్లా హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. కొండచరియల కింద పలు వాహనాల్లో సుమారు 40 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. సమాచారమందుకున్న ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. 

ప్రధాని ఆరా..

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి కేంద్రం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు అమిత్ షా కూడా ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని