Corona: 6 రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ

తాజా వార్తలు

Updated : 16/07/2021 14:56 IST

Corona: 6 రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తున్నా.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. దీంతో కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష నిర్వహించారు.

కరోనా కేసులు ఎక్కువగా ఉంటున్న ఆంధప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎంలు జగన్‌ మోహన్‌రెడ్డి, పినరయి విజయన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, నవీన్‌ పట్నాయక్‌, యడియూరప్ప, స్టాలిన్‌లతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని అప్రమత్తం చేశారు.

అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. కఠిన నిబంధనలు అమలు చేసి మూడో దశ రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ‘టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సిన్‌’ విధానాన్ని మరింత విస్తరింపజేయాలని తెలిపారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కొత్త కేసులు, మరణాల్లో దాదాపు 80శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు తెలిపాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని