Ahmedabad: 80శాతం మందిలో యాంటీబాడీలు!

తాజా వార్తలు

Published : 19/07/2021 20:46 IST

Ahmedabad: 80శాతం మందిలో యాంటీబాడీలు!

సెరో సర్వేలో వెల్లడి

అహ్మదాబాద్‌: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో చాలా మంది వైరస్‌కు ప్రభావితమవుతున్నారనే నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు పలు రాష్ట్రాల్లో సెరోలాజికల్‌సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లో దాదాపు 80శాతానికి పైగా ప్రజల్లో కొవిడ్‌-19 యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా జరిపిన సెరోసర్వేలో వెల్లడైంది. అనగా నగరంలోని మెజారిటీ ప్రజలు కొవిడ్‌-19కు ప్రభావితమయ్యారని నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయానికి గుజరాత్‌ కూడా వణికిపోయింది. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు మే 28 నుంచి జూన్‌ 3 మధ్యకాలంలో అమ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (AMC) సెరో సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5వేల మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షించింది. వీటిలో 81శాతం (4056) మందిలో కొవిడ్‌-19 యాండీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలోనే ఎక్కువ మోతాదులో యాంటీబాడీలు ఉన్నాయని AMC వైద్యాధికారి డాక్టర్‌ భావిన్‌ సోలంకి పేర్కొన్నారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఇదివరకు కొవిడ్‌ వచ్చిన వారితో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది మే నాటికి అహ్మదాబాద్‌లో సాధారణ ప్రజల్లో దాదాపు 81.63శాతం మంది కొవిడ్ యాంటీబాడీలు కలిగి ఉన్నారనే అంచనాకు వచ్చారు. ఇదిలాఉంటే, ఇప్పటివరకు గుజరాత్‌లో 8లక్షల మందిలో వైరస్‌ బయటపడగా.. వారిలో 10వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని