Record vaccination: నిన్న ఆ పార్టీకి జ్వరం వచ్చింది.. లాజిక్ ఏంటో ?: మోదీ

తాజా వార్తలు

Updated : 18/09/2021 14:24 IST

Record vaccination: నిన్న ఆ పార్టీకి జ్వరం వచ్చింది.. లాజిక్ ఏంటో ?: మోదీ

మీరంతా నిన్నటి రోజును ప్రత్యేకంగా మార్చారన్న ప్రధాని

దిల్లీ: ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 2.5 కోట్ల టీకా డోసులు వేయడంపై ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన వైద్యసిబ్బంది, ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. పలు సంపన్న దేశాలు కూడా ఈ ఫీట్‌ను సాధించలేకపోయానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అదే సమయంలో విమర్శలు చేస్తోన్న రాజకీయ పార్టీలకు చురకలు అంటించారు. శనివారం గోవాకు చెందిన వైద్య సిబ్బంది, టీకా లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. 

‘నేను శాస్త్రవేత్తను కాదు..వైద్యుడిని కాదు. కానీ టీకా వేయించుకున్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని విన్నాను. నిన్న భారత్ రికార్డు స్థాయిలో టీకా డోసుల్ని పంపిణీ చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీకి జ్వరం రావడం నేను చూశాను. ఇందులో ఏదైనా లాజిక్ ఉందా..?’ అంటూ టీకా కార్యక్రమంపై వస్తోన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. అలాగే ఈ ఫీట్ సాధించే క్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు అందించిన సహకారంపై సంతోషం వ్యక్తం చేశారు. 

‘నిన్నటి రికార్డులో భాగంగా.. ప్రతి గంటకు 15 లక్షల మందికి, నిమిషానికి 26 వేల మందికి, సెకనుకు 425 మందికి టీకాలు అందాయి. నిన్నటి రోజు నన్నెంతో ఉద్వేగానికి గురిచేసింది. మీ అందరి కృషితో అది నాకు ప్రత్యేకమైన రోజుగా మారింది’ అని వెల్లడించారు. అలాగే గోవా వైద్య సిబ్బంది, లబ్ధిదారుల అభిప్రాయాలను ఆయన విన్నారు. ఈ టీకా కార్యక్రమం విజయంలో గోవా కీలక పాత్ర పోషించిందని ప్రధాని కొనియాడారు.

మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని నిన్న టీకా కార్యక్రమం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2.5 కోట్ల డోసుల్ని పంపిణీ చేయగా.. మొత్తంగా 79 కోట్లకు పైగా డోసులు ప్రజలకు అందాయి. ఇదిలా ఉండగా.. గోవా జనాభా(అర్హులు)లో 100 శాతం మంది టీకా మొదటి డోసు వేయించుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని