PM modi: కరోనా కట్టడిలో యూపీ భేష్

తాజా వార్తలు

Published : 15/07/2021 14:11 IST

PM modi: కరోనా కట్టడిలో యూపీ భేష్

వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ ప్రశంస

దిల్లీ: కరోనా వైరస్‌ను ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అద్భుతంగా కట్టడి చేయగలిగిందని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో గురువారం పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అభినందించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ మైదానంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘యూపీ ప్రభుత్వం వైరస్‌పై సమర్థంగా పోరాడింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రం మహమ్మారిని కట్టడి చేసిన తీరు ప్రశంసనీయం. కరోనా వారియర్లకు, ఈ క్లిష్ట సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే దేశంలో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రాష్ట్రంగా యూపీ నిలిచింది. అందరికీ టీకా అందించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం ముందుకెళ్తోంది’’ అని ప్రధాని అన్నారు. అంతేకాకుండా కాశీ నగరం త్వరలో మెడికల్ హబ్‌గా మారనుందని చెప్పారు. ఇక నుంచి వైద్యసేవల కోసం దిల్లీ, ముంబయి వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, అన్నీ ఇక్కడే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కరోనా విజృంభణ వేళ కాంవడ్ యాత్రకు అనుమతివ్వడంపై నిన్న సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ మరుసటిరోజే ప్రధాని యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. కరోనా రెండోదఫా విజృంభణ సమయంలో ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 30 వేల కేసులు వెలుగుచూశాయి. మొదటి దఫాలో అవి ఏడువేలు మాత్రమే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని