Modi: మోదీ, పవార్ భేటీ..

తాజా వార్తలు

Updated : 17/07/2021 19:47 IST

Modi: మోదీ, పవార్ భేటీ..

50 నిమిషాల పాటు చర్చించుకున్న నేతలు

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ 50 నిమిషాల పాటు కొనసాగింది. వారి సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌లో షేర్ చేసింది. ‘రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని మోదీని కలుసుకున్నారు’ అంటూ వెల్లడించింది. అయితే భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. శరద్ పవార్ వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే విపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలో దిగుతారంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘అధికార పార్టీకి 300 మందికి పైగా ఎంపీలున్నారు. ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవన్నీ ఊహాగానాలే’ అంటూ పవార్ ఖండించారు. అయితే ఈ సమయంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని