Afghan - Taliban: తాలిబన్లను తక్కువ అంచనా వేయొద్దు!

తాజా వార్తలు

Updated : 31/08/2021 18:25 IST

Afghan - Taliban: తాలిబన్లను తక్కువ అంచనా వేయొద్దు!

ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ను సొంతం చేసుకున్న తాలిబన్లను ప్రస్తుత సమయంలో తక్కువ అంచనా వేయొద్దని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విలియం డాల్రింపుల్ (William Dalrymple) హెచ్చరించారు. పాకిస్థాన్‌ నుంచి నిధులు, శిక్షణ, ఆశ్రయం పొందారనడంలో ఎటువంటి సందేహం లేదన్న ఆయన.. అవసరమైతే వారికి ఆపన్నహస్తం అందించిన పాకిస్థాన్‌ నుంచే విముక్తి పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అఫ్గాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమేనని ‘రిటర్న్‌ ఆఫ్‌ ఏ కింగ్‌: ది బ్యాటిల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌’ పుస్తక రచయిత విలియం డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. ఇది హేతుబద్ధమైన నిర్ణయమని అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ముఖ్యంగా అమెరికా విదేశీ విధానంలో గత వందేళ్లలో జరిగిన వ్యూహాత్మక తప్పిదాల్లో అఫ్గాన్‌ అంశమే అతిపెద్దదిగా నిలుస్తుందన్నారు. ఇది ఆ దేశఖ్యాతిని దిగజార్చే ప్రమాదం కూడా లేకపోలేదని విలియం డాల్రింపుల్‌ పేర్కొన్నారు.

పాక్‌ చేతిలో కీలుబొమ్మ కాకపోవచ్చు..

తాలిబన్లను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉద్యమంగా కొందరు వ్యూహకర్తలు/రచయితలు భావించడం సరైనది కాదని విలియం డాల్రింపుల్‌ స్పష్టంచేశారు. అది కచ్చితంగా అఫ్గాన్‌ ఉద్యమమేనని.. కానీ, వారికి నిధులు అందించడం, ఆయుధాలు సమకూర్చడం, శిక్షణతో పాటు వారికి ఆశ్రయాన్ని పాకిస్థాన్‌ కల్పిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. గత 25ఏళ్లుగా పాకిస్థాన్‌ నుంచి ఈ మద్దతు కొనసాగుతున్న మాట వాస్తవమేనన్నారు. ఇక తాలిబన్ల స్వయంప్రతిపత్తిని కొందరు తక్కువ అంచనా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వారి చేతిలోనే అధికారం ఉన్నందున ఇంతకాలం వారికి యజమానిగా ఉన్న పాకిస్థాన్‌ నుంచే విముక్తి కోరే అవకాశాలు లేకపోలేదని విలియం డాల్రింపుల్‌ పేర్కొన్నారు. అందుకే వారిని పూర్తిగా పాకిస్థాన్‌ చేతిలో కీలుబొమ్మ (Pakistani Puppet) గా వర్ణించలేమని చెప్పారు. అయితే, పలు అంశాల్లో పాకిస్థాన్‌ తాలిబన్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరువురి మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు తాలిబన్లు సొంత మార్గాన్ని ఎన్నుకునే అవకాశాలే ఎక్కువ అని విశ్లేషించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని