Terror Attack: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు

తాజా వార్తలు

Updated : 13/08/2021 05:35 IST

Terror Attack: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగుతున్నారు. తాజాగా గురువారం కుల్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) కాన్వాయ్‌పై కాల్పులకు తెగబడ్డారు. సదరు కాన్వాయ్‌ జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా.. కుల్గాం జిల్లాలోని మల్‌పోర వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.  భద్రతా సిబ్బందిలో ఎవరికి ఏం కాలేదని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. దాడికి పాల్పడినవారు అక్కడే దాక్కుని ఉన్నారని చెప్పారు. మరోవైపు అధికార బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, సీనియర్ అధికారులు కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ స్థానికంగా ఉగ్రవాదుల వరుస దాడులు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. సోమవారం అనంతనాగ్‌ జిల్లాలో భాజపా నేత, ఆయన భార్యను కాల్చి చంపిన ముష్కరులు.. మంగళవారం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని