JK: పోలీసు అధికారిని చంపిన ఉగ్రవాదులు

తాజా వార్తలు

Published : 28/06/2021 10:13 IST

JK: పోలీసు అధికారిని చంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జమ్మూకశ్మీర్‌ మాజీ ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్‌పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ సహా ఆయన కుటుంబంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఫయాజ్‌తో పాటు ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలో ఉన్న ఫయాజ్‌ నివాసంలోకి ఉగ్రవాదులు ఆదివారం చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వారందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్థానికులు, బంధువులు.. ఫయాజ్‌ సహా ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భార్య చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుమార్తె మాత్రం మృత్యువు నుంచి బయటపడ్డప్పటికీ.. తీవ్రమైన బుల్లెట్‌ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కలిసి ఫయాజ్‌ దంపతుల అంత్యక్రియలు పూర్తిచేశారు. కుమారుడు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు కూడా అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. అయినా సైన్యం నుంచి వైదొలగకుండా.. దేశ సేవలోనే కొనసాగుతుండడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని