పోలీసులే బంధువులు- స్టేషనే ఆమె ఇల్లు!

తాజా వార్తలు

Updated : 19/03/2021 10:16 IST

పోలీసులే బంధువులు- స్టేషనే ఆమె ఇల్లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరూ లేని ఆ మహిళకు పోలీసులే ఆత్మబంధువులయ్యారు. 40 ఏళ్లుగా పోలీస్‌స్టేషన్‌లోనే వసతి కల్పించి మానవత్వం చాటుకుంటున్నారు. హోన్నమ్మ... ఓ అనాథ దివ్యాంగురాలు. సైగలతోనే మాట్లాడుతుంది. 20 ఏళ్ల వయసులో మంగళూరు రైల్వే స్టేషన్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను ఓ పోలీస్‌ అధికారి చేరదీశారు. ఊరు, పేరు తెలియని ఆమెకు హోన్నమ్మ అని పేరు పెట్టారు. ఆమె కుటుంబసభ్యుల ఆచూకీ కోసం పోలీసులు చాన్నాళ్లు దర్యాప్తు చేసినా ప్రయోజనం లేదు. ఫలితంగా.. మంగళూరులోని బండారు పోలీస్‌స్టేషన్‌లోనే ఆమె స్థిరపడాల్సి వచ్చింది.

 పోలీసులనే సొంతవారిగా భావిస్తున్న హొన్నమ్మ వారికి చేదోడు వాదోడుగా ఉంటోంది. స్టేషన్‌ను శుభ్రం చేయడం, ఫైళ్లు అందజేయడం, టీ, కాఫీలు అందించటం వంటివి చేస్తోంది. ఆమె సేవలకు పోలీసులు జీతం కూడా ఇస్తున్నారు. స్టేషన్‌ పక్కనే ఇటీవల ఆమెకు ప్రత్యేక గది నిర్మించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆధార్‌ కార్డులో హోన్నమ్మ ఇల్లు.. బండారు పోలీస్‌స్టేషన్‌గానే ఉంది. ఓటర్‌ కార్డులోనూ ఇదే చిరునామా. హోన్నమ్మ తమకు ఆత్మబంధువని అక్కడి పోలీసులు చెబుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని