ఇది మహిళలు విధించిన లాక్‌డౌన్‌..!

తాజా వార్తలు

Published : 27/04/2021 20:01 IST

ఇది మహిళలు విధించిన లాక్‌డౌన్‌..!

కరోనా కేసు లేని చిఖలార్‌ గ్రామం

చిఖలార్(మధ్యప్రదేశ్‌): కరోనా రెండో దశ సృష్టిస్తోన్న కల్లోలం ప్రజలు, ప్రభుత్వాలను కలవరపెడుతోంది. పెద్ద నగరాల నుంచి మారు గ్రామాలకు సైతం మహమ్మారి విజృంభిస్తోంది. ఇంత ఉద్ధృతిలోనూ.. మధ్యప్రదేశ్‌లోని చిఖలార్ గ్రామంలో కరోనా ఆనవాలు లేదు. నమ్మశక్యంకాని ఈ నిజం ఆ గ్రామంలోని మహిళల వల్లే సాధ్యమైంది. వివరాల్లోకి వెళ్తే..

కరోనా మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని రక్షించుకునేందుకు బేతుల్‌ నగరానికి సమీపంలోని చిఖలార్‌ మహిళలు తమ గ్రామాన్ని లాక్‌డౌన్‌ చేశారు. బయటివారు ఎవరు గ్రామంలోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేశారు. కొందరు మహిళలు గ్రామ సరిహద్దుల్లో కర్రలు పట్టుకొని కాపలాగా నిల్చున్నారు. ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే వెదురు కర్రలతో సరిహద్దులను మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా తమ గ్రామాన్ని ఆనుకొని ఉన్న ప్రధాన రహదారిపై వెళ్తోన్న వారిని వారు ఓ కంట కనిపెడుతున్నారు. కరోనా నుంచి గ్రామాన్ని రక్షించుకోవడం కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అక్కడి మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. అలాగే ఆ గ్రామంలోని వారు కూడా ఇష్టం వచ్చినట్లు బయటకు వెళ్లడానికి లేదు. అక్కడివారికి కావల్సినవన్నీ తెచ్చి ఇచ్చేందుకు ఇద్దరు యువకులను నియమించుకున్నారు. అక్కడి మహిళలు ఇంత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు కాబట్టే చిఖలార్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇక, మధ్యప్రదేశ్‌లో తాజాగా 12,686 మందికి కరోనా సోకగా..88 మంది మరణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని