ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

తాజా వార్తలు

Updated : 19/02/2021 11:45 IST

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

మరో ఘటనలో ఎస్పీ వీరమరణం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియన్‌ జిల్లా బుద్గామ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు కశ్మీర్‌ పోలీసులతో కలిసి సైన్యం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఆ ప్రాంతంలో తనిఖీలు వెల్లడించారు. ఉద్ఘావ్‌లో జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో ఎస్పీ ప్రాణాలు కోల్పోగా మరో జవాను గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని