జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

తాజా వార్తలు

Published : 29/01/2021 18:55 IST

జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాద కదలికల సమాచారంతో శుక్రవారం భద్రతా దళాలు మండూరా ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులు భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ప్రతిఘటించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి గాయాలవ్వలేదని పోలీసులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదులను గుర్తించే చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి..

సింఘులో మళ్లీ ఉద్రిక్తతలు

ద్వైపాక్షిక బంధానికి అష్టోత్తరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని