త్రిపుర సీఎంకు కరోనా

తాజా వార్తలు

Published : 07/04/2021 18:54 IST

త్రిపుర సీఎంకు కరోనా

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేబ్ కరోనా బారిన పడినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కరోనా ఆర్‌టి-పీసీఆర్‌ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అందరూ కరోనా నిబంధనలు పాటించి, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకూ 33,554 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 389 మరణాలు సంభవించాయి. 33,069 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 98.63 శాతానికి చేరుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని