Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు సైనికుల వీరమరణం!

తాజా వార్తలు

Published : 15/10/2021 13:56 IST

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు సైనికుల వీరమరణం!

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. మృతుల్లో ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీఓ) ఉన్నారు. పూంఛ్‌ జిల్లా నర్ ఖాస్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. జవాన్‌ మృతదేహాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకోగా.. జేసీఓ మృతదేహం ఇంకా లభించాల్సి ఉంది. ఇటీవల పూంఛ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ముష్కరులంతా గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో పాగా వేసినట్లు పోలీసులు సమాచారం అందిన నేపథ్యంలోనే నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వరుస ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని