Donald Trump: బాక్సింగ్‌ పోటీలకు వ్యాఖ్యాతగా డొనాల్డ్ ట్రంప్ !

తాజా వార్తలు

Published : 10/09/2021 01:51 IST

Donald Trump: బాక్సింగ్‌ పోటీలకు వ్యాఖ్యాతగా డొనాల్డ్ ట్రంప్ !

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. 58 ఏళ్ల మాజీ హెవీ వెయిట్ ఛాంపియన్ ఎవాండర్ హోలీఫీల్డ్  తలపడుతున్న బాక్సింగ్ పోటీలకు ట్రంప్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో జరిగే ఈ పోటీలకు తనయుడు డొనాల్డ్ జూనియర్‌తో కలిసి ట్రంప్‌ వ్యాఖ్యానం చేయనున్నారు. గొప్ప పోరాటాలు, పోరాట వీరులంటే తనకు ఇష్టమని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ నెల 11న జరిగే బాక్సింగ్‌ పోటీలను వీక్షించేందుకు, తన ఆలోచనలు పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. కాగా డొనాల్డ్‌ ట్రంప్‌కు బాక్సింగ్‌కు మంచి అనుబంధం ఉంది. గతంలో కొన్ని బాక్సింగ్‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు, పలు బౌట్లను ట్రంప్‌ ప్రమోట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని