United States: అమెరికా వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి

తాజా వార్తలు

Published : 14/10/2021 02:29 IST

United States: అమెరికా వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను అనుమతించని అమెరికా.. ఇకపై ఎలాంటి కారణాలు లేకపోయినా అనుమతించనుంది. ఈ మేరకు బుధవారం నూతన నిబంధనలు ప్రకటించించింది. ఈ కొత్త నిబంధనలు నవంబరు నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్  వేయించుకోవాలని.. అలాంటి వారికి క్వారంటైన్  అవసరం ఉండదని స్పష్టం చేసింది. ప్రయాణికులు టీకా ధ్రువపత్రం, కొవిడ్‌ నెగెటివ్ ధ్రువపత్రాలు తీసుకురావాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు పొందిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా అనుమతించనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.

కొవిడ్‌ విజృంభణ కారణంగా గతేడాది మార్చిలో కెనడా, మెక్సికో దేశాలతో ఉన్న సరిహద్దులను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ సరిహద్దులు తెరుచుకోనుండటంతో పర్యాటకం మళ్లీ పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని