Assam-Mizoram border dispute: సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంటాం

తాజా వార్తలు

Updated : 01/08/2021 13:27 IST

Assam-Mizoram border dispute: సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంటాం

మిజోరం ముఖ్యమంత్రి జోరాంథాంగా

గువాహటి: అస్సాంతో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో కలిపి జరిగిన ఫోన్‌ సంభాషణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం మిజోరం ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. 

‘‘అమిత్‌ షా, హిమంత బిశ్వ శర్మతో జరిగిన ఫోన్‌ సంభాషణ ప్రకారం.. అస్సాం-మిజోరం సరిహద్దు వివాదాన్ని అర్థవంతమైన చర్చల ద్వారా.. ఆమోదయోగ్యంగా పరిష్కరించుకుకోవాలని నిర్ణయించాం. ఈ సమయంలో పరిస్థితులు చేయిదాటకుండా ప్రజలు సంయమనం పాటించాలి. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టొద్దని మిజోరం ప్రజలను కోరుతున్నాం’’ అని జోరాంథాంగా విజ్ఞప్తి చేశారు.

హిమంతపై కేసు వాపస్‌?

మరోవైపు ఈ ఘర్షణల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై మిజోరం అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. తనకు గానీ, ముఖ్యమంత్రి జోరాంథాంగాకు గానీ కేసు విషయం తెలియదన్నారు. ఈ విషయాన్ని పరిశీలించమని సీఎం తనని ఆదేశించినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి కేసుపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని