ఈ రోజుని ఎప్పటికీ మరువలేం: మోదీ

తాజా వార్తలు

Published : 13/12/2020 09:55 IST

ఈ రోజుని ఎప్పటికీ మరువలేం: మోదీ

దిల్లీ: సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రమూకలు జరిపిన దాడిని ఎవరూ మరువలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆనాడు ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. ‘‘ 2001లో ఇదే రోజు పార్లమెంటుపై పిరికిపందలు జరిపిన దాడిని ఎప్పటికీ మరువలేం. మన పార్లమెంటును కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసినవారి శౌర్యప్రతాపాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం వారికెప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది’’ అంటూ మోదీ ట్విటర్‌ వేదికగా వారికి నివాళులర్పించారు.

2001, డిసెంబరు 13న ఐదుగురు సభ్యుల ఉగ్రమూక పార్లమెంటుపై దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. వారంతా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందినవారు. అప్పటికీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సరిగ్గా దాడి జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయినా, ఇంకా కొంతమంది సభ్యులు, సిబ్బంది భవనంలోనే ఉన్నారు. ఒక్కసారిగా కారులో దూసుకొచ్చిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. వారు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించకుండా నిలువరించే క్రమంలో దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌, ఇద్దరు పార్లమెంట్‌ వాచ్‌ అండ్‌ వార్డ్‌ సెక్షన్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఓ తోటమాలి, ఫొటో జర్నలిస్టు కూడా మృతిచెందారు.

ఇవీ చదవండి..

రైతు సంక్షేమమే మా విధానం 

బెంగాల్‌లోని ముగ్గురు ఐపీఎస్‌లకు.. కేంద్ర హోంశాఖ హుకుం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని