ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రి

తాజా వార్తలు

Updated : 03/03/2021 14:49 IST

ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రి

ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం

బెంగళూరు: దేశంలో మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, 45ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక రోగులకు టీకాను అందిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు టీకాలు తీసుకున్నారు. ప్రధాని మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా తీసుకోగా, ఇతరులు దగ్గర్లోని ఆస్పత్రుల్లో టీకా తీసుకున్నారు. కానీ, కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ మంగళవారం తన స్వగృహంలో టీకాను తీసుకున్నారు. దీన్ని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా పలు విమర్శలు ఎదురయ్యాయి. ఈ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం కఠిన నిబంధనలు రూపొందించామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు తనపై వస్తున్న విమర్శలపై మంత్రి బీసీ పాటిల్‌ స్పందించారు. తాను ఆస్పత్రికి వెళ్తే అక్కడి ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఇంటి దగ్గర టీకా తీసుకున్నానని ఆయన వివరణచ్చారు. కాగా దేశంలో ఇప్పటి వరకు కోటీ యాభైలక్షల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకొనేవారు ముందుగా కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రైవేటు కేంద్రాల్లో టీకా ధర రూ. 250గా ఉంది. పదివేల ప్రభుత్వ, 20వేల ప్రైవేటు కేంద్రాల్లో టీకాను అందిస్తున్నట్లు కేంద్రం గతంలో తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని