Unlock: కర్ణాటకలో లాక్‌డౌన్‌ సడలింపులు

తాజా వార్తలు

Published : 19/06/2021 22:21 IST

Unlock: కర్ణాటకలో లాక్‌డౌన్‌ సడలింపులు

బెంగళూరు: కరోనా కట్టడి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో యడియూరప్ప ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతానికి దిగివచ్చింది. మరో 13 జిల్లాల్లో 5-10 శాతంగా ఉంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ‘అన్‌లాకింగ్‌’ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర కొవిడ్ సలహా కమిటీతో సమావేశం అనంతరం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి...
* అన్ని దుకాణాలు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరుచుకోవచ్చు.
* 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు, క్లబ్లులు, రెస్టారెంట్లకు (ఏసీ లేకుండా) సాయంత్రం 5 గంటల వరకు అనుమతి
* బస్సులు, మెట్రో సర్వీసులు 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో నడిపేందుకు నిర్ణయం
* 50 శాతం కెపాసిటీతో వ్యాయామశాలలకు అనుమతి
* లాడ్జిలు, రిసార్టులు 50 శాతం సామర్థ్యంతో తెరచుకోవచ్చు.

సందర్శనీయ ప్రాంతం మైసూరులో పాటిజివిటీ రేటు 10 శాతానికిపైగా ఉండటంతో గతంలో ఉన్న ఆంక్షలనే కొనసాగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉండనుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం వీకెండ్‌ కర్ఫ్యూను కొనసాగించనుంది. ఈత కొలనులు, ప్రార్థనా స్థలాలు, మాల్స్, థియేటర్లు, ఏసీ షాపింగ్ కాంప్లెక్సులతోపాటు పబ్బుల మూసివేత కొనసాగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని