కరోనా మూలాలపై వుహాన్‌ ఆస్పత్రుల్లో శోధన

తాజా వార్తలు

Updated : 30/01/2021 15:21 IST

కరోనా మూలాలపై వుహాన్‌ ఆస్పత్రుల్లో శోధన

బీజింగ్‌: కరోనా మూలాలపై పరిశోధన చేపట్టేందుకు చైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఇటీవలే 14 రోజుల క్వారంటైన్ ముగించుకుంది. క్షేత్రస్థాయిలో కరోనా మూలాలపై పరిశోధనను ప్రారంభించింది. మహమ్మారి పుట్టిల్లుగా భావిస్తున్న వుహాన్‌ నగరంలో మొట్టమొదట కరోనా రోగులకు చికిత్స అందించిన ఆస్పత్రుల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శనివారం నిపుణులు జిన్​యాన్​టాన్​ ఆస్పత్రిని సందర్శించారు. శుక్రవారం చైనా శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. హుబెయ్‌ ప్రావిన్సులోని కొన్ని ​ఆస్పత్రులను సందర్శించారు. అలాగే వైరస్‌ తొలుత వెలుగులోకి వచ్చిన ​సీ-ఫుడ్​ మార్కెట్, వివాదాస్పదంగా మారిన వుహాన్ ​ఇన్‌స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీ సహా మరికొన్ని స్థానిక ల్యాబ్‌లను సందర్శించనున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కొంత సమాచారం సేకరించామని, వైరస్​ మూలాలను కనుగొనేందుకు మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో గురువారం చేసిన ట్వీట్‌లో పేర్కొంది.

కరోనా వైరస్‌ విషయంలో చైనా మొదటి నుంచి ప్రపంచానికి సరైన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. వీటికి బలం చేకూర్చే సంఘటనలు కొద్ది రోజులుగా చైనాలో ఎక్కువయ్యాయి. కొవిడ్‌ మూలాలపై మాట్లాడిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తోందనే వాదనలూ ఉన్నాయి. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌వో బృందంతో సమావేశం అవుతామని కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేయడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బృందం వుహాన్‌ చేరుకున్నప్పటి నుంచి స్థానిక అధికారులు తమకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. ఇలా ఎన్నో అవరోధాల నడుమ ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మూలాలపై వుహాన్‌లో శోధన ప్రారంభించింది. దీంతో ఆ బృందం ఏం తేలుస్తుందనే విషయంపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. తొలుత డబ్ల్యూహెచ్‌ బృందాన్ని అనుమతించేందుకు సైతం చైనా తీవ్ర జాప్యం చేసింది. 

ఇవీ చదవండి...

బెడిసికొడుతున్న చైనా వ్యూహం!

14 రోజులు.. 33లక్షల మందికి టీకాలుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని