వుహాన్‌ ల్యాబ్‌లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం

తాజా వార్తలు

Published : 03/02/2021 20:05 IST

వుహాన్‌ ల్యాబ్‌లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం

వుహాన్‌: కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమని అనుమానిస్తున్న వుహాన్‌ నగరంలోని ల్యాబరేటరీని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం సందర్శించింది. కరోనా వైరస్‌ ఎలా పుట్టింది ఎలా వ్యాప్తి చెందింది? అనే కోణంలో వివరాలు, ఆధారాలు సేకరించడమే లక్ష్యంగా వుహాన్‌లోని వైరాలజీ సంస్థను సందర్శించింది. చైనాలోని అత్యున్నత పరిశోధనా ల్యాబ్‌గా గుర్తింపు ఉన్న వుహాన్‌ వైరాలజీ సంస్థ 2003లో వచ్చిన సార్స్‌ వైరస్‌ తర్వాత కరోనా వైరస్‌ జన్యు సమాచారాన్ని క్రోడీకరించింది. అక్కడి నుంచే కరోనా వైరస్‌ ఏర్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వైరస్‌ మరెక్కడైనా పుట్టిఉండవచ్చని, లేదా దిగుమతి చేసుకున్న కలుషిత సముద్ర ఆహారం ద్వారా తమ దేశంలోకి ప్రవేశించి ఉండొచ్చని వాదిస్తోంది. అయితే అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు చైనా వాదనను తిరస్కరిస్తున్నారు.

ఇవీ చదవండి...

వుహాన్‌ మార్కెట్‌లో కరోనా మూలాల శోధన!

కరోనా నకిలీ వ్యాక్సిన్ల సరఫరా.. 80 మంది అరెస్టుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని