వుహాన్‌: ‘కీలక ఆధారాలు’ లభ్యం

తాజా వార్తలు

Updated : 08/02/2021 19:00 IST

వుహాన్‌: ‘కీలక ఆధారాలు’ లభ్యం

వుహాన్‌: కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమని భావిస్తున్న చైనా నగరం వుహాన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. మహమ్మారి పుట్టుక, వ్యాప్తికి సంబంధించిన వివరాలు, ఆధారాల సేకరణకు 14 మంది సభ్యుల ఈ బృందం రెండువారాలు క్షేత్రస్థాయి పర్యటన చేయనుంది.

కాగా.. కొవిడ్‌ వ్యాప్తిలో వుహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ పాత్రకు సంబంధించి ముఖ్య ఆధారాలు లభ్యమైనట్టు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృంద సభ్యుడు పీటర్‌ డెస్‌జాక్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఫిబ్రవరి 10న పర్యటన ముగుస్తుందని.. తాము తిరిగి వెళ్లేలోపు ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలను వెల్లడి చేసే అవకాశముందని న్యూయార్క్‌కు చెందిన ఈ జంతు శాస్త్రజ్ఞుడు వివరించారు.

అంతేకాకుండా ఈ బృందం వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలతో కూడా సమావేశమైంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకుని, అర్థం చేసుకోవటం ద్వారా.. మరిన్ని మహమ్మారులు తలెత్తే ప్రమాదాన్ని నివారించవచ్చని పీటర్‌ అన్నారు.

ఇవీ చదవండి..

కరోనా మరణాలు @ 84

కరోనా టీకా: దూసుకుపోతున్న భారత్‌

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని