Donald Trump: ‘దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించారు’

తాజా వార్తలు

Published : 12/09/2021 01:09 IST

Donald Trump: ‘దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించారు’

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. అఫ్గాన్‌నుంచి అమెరికన్‌ బలగాల ఉపసంహరణ క్రమంలో బైడెన్‌ అసమర్థంగా వ్యవహరించారన్నారు. 9/11 దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శనివారం ట్రంప్‌ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇది చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. అమెరికాకు హాని కలిగించిన వారిపై ఇటీవల యుద్ధం ముగించిన తీరూ విచారకరమని.. అఫ్గాన్‌ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రణాళికలు, బలహీనత, ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని నాయకులే ఇందుకు కారణమని ఆరోపించారు. ‘దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించారు. ఇలా ఎప్పుడూ జరగకూడదు’ అని బైడెన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆగస్టు 26న కాబుల్‌ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందడం, అగ్రరాజ్యం వదిలేసిన ఆయుధ సామగ్రిని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంపై కూడా ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ‘జో బైడెన్, ఆయన అసమర్థ పాలన.. ఓటమికి లొంగిపోయాయి. దీంతో కలిగిన ఇబ్బందుల నుంచి కోలుకునేందుకు అమెరికన్లు కష్టపడాల్సి వస్తుందని’ అన్నారు.  9/11 దాడుల అనంతరం అమెరికా.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అఫ్గాన్‌లోకి అడుగుపెట్టడం, 20 ఏళ్ల సుదీర్ఘ పోరు తర్వాత ఇటీవల అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేసిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని