Offbeat: భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మ!

తాజా వార్తలు

Updated : 22/07/2021 16:58 IST

Offbeat: భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మ!

ఓక్లహామా: 40 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? భద్రపరిచిన పిండం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే మహిళ ఈ ఫీట్​ను సాధించింది. మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త కోరిక మేరకే ఈ సాహసం చేసినట్లు చెప్పుకొచ్చింది. తన పిల్లలకు తండ్రి లేని లోటు తెలియకుండా చూసుకుంటానని ధీమాగా చెబుతోంది అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆ ఉపాధ్యాయురాలు. 

సారా షెలెన్‌ బెర్గర్‌కు 2018 సెప్టెంబర్‌లో స్కాట్‌ (41)తో వివాహం జరిగింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో స్కాట్‌ గుండెపోటుతో మరణించాడు. గతంలోనూ స్కాట్‌కు గుండెపోటు రాగా.. భద్రపరిచిన పిండాలు (embryo fertilisation) ద్వారా పిల్లల్ని కనాలని ఈ దంపతులు అప్పుడే నిర్ణయించుకున్నారు. స్కాట్‌కు మరోసారి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. భర్త మరణించిన ఆరు నెలల అనంతరం.. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్‌ సహకారంతో సారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ పద్ధతిలో మరో పిండం భద్రపరిచి ఉందని తెలిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

సారా మాట్లాడుతూ.. ‘మేం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకునే వాళ్లం. శిశువు పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఒక అర్థం లభించింది. చిన్నారి రాకతో నా మాతృ హృదయం సంతృప్తి చెందింది. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోంది. నా పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా’ అని పేర్కొంది. సారా ఆ చిన్నారిని ముద్దుగా ‘గుడ్‌ మెడిసిన్’ అని పిలుచుకుంటోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని