సహాయం కోసం..2.47లక్షల మందికిపైగా కాల్‌ చేశారు

తాజా వార్తలు

Published : 11/02/2021 22:58 IST

సహాయం కోసం..2.47లక్షల మందికిపైగా కాల్‌ చేశారు

దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఉమెన్ హెల్ప్‌లైన్‌కి 2.47 లక్షల మందికి పైగా ఫోన్ చేసి సహాయం కోరారు. గురువారం రాజ్యసభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ దీనికి సంబంధించి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

‘హింస, బాధలను ఎదుర్కొనే మహిళలకు సహకరించేందుకు యూనివర్సలైజేషన్ ఆఫ్ విమెన్ హెల్ప్‌లైన్ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. టోల్ ఫ్రీ నంబర్‌ 181కు ఫోన్‌చేసి మహిళలు వారి బాధలను వెల్లడించవచ్చు. ఈ సేవలు 33 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల వారీగా అందిన సమాచారం మేరకు ఏప్రిల్, 2020 నుంచి జూన్‌, 2020 మధ్యలో ఈ పథకం కింద 2.47 లక్షలకు పైగా కాల్స్‌ నమోదయ్యాయి’ అని మంత్రి వెల్లడించారు. అలాగే గత మూడు సంవత్సరాల్లో జాతీయ బాలల హక్కుల పరిరక్షక కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌)కు పోక్సో ఇ-బాక్స్‌ ద్వారా 354 ఫిర్యాదులు అందాయని తెలిపారు.

కరోనా వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం గతేడాది మార్చి 25 నుంచి మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. జూన్ నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

ఇవీ చదవండి:

స్వేచ్ఛనిచ్చాం..కానీ, చట్టాలను పాటించాల్సిందే

‘గల్వాన్‌’ ఘర్షణలో 45 మంది చైనా జవాన్ల మృతి!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని