పగ సాధిద్దామనుకుంటే..  బెడిసి కొట్టింది!

తాజా వార్తలు

Published : 10/07/2021 01:11 IST

పగ సాధిద్దామనుకుంటే..  బెడిసి కొట్టింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమికులు విడిపోవడానికి వ్యక్తిగతంగా అనేక కారణాలుంటాయి. ఒక వేళ మోసపోయినట్లయితే ప్రేమించిన వ్యక్తిపై ప్రేమ పోయి పగలూ ప్రతికారేచ్ఛలు పెరిగే అవకాశముంది. చైనాలోని షావోజింగ్‌ ప్రాంతానికి చెందిన లావ్‌ అనే యువతి కూడా అలాగే తన నుంచి విడిపోయిన ప్రియుడిపై పగ పెంచుకుంది. తనను కాదని మరో అమ్మాయిని ప్రేమిస్తున్న అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ఆమె.. అతడి కారును అద్దెకు తీసుకొని రెండ్రోజులపాటు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై చక్కర్లు కొట్టింది. 49 సార్లు రెడ్‌లైట్‌ ఉన్నప్పుడు కారును నడిపించడంతో పాటు ఒకసారి ఓవర్‌స్పీడ్‌గా నడిపిస్తూ మొత్తం 50 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించింది.

ఈ విషయంలో లావ్‌కు ఆమె స్నేహితుడు సాయం చేశాడు. అతడి ద్వారానే లావ్‌ తన మాజీ ప్రియుడి నుంచి కారును అద్దెకు తీసుకోగలిగింది. తన స్నేహితుడితో కలిసి చేసిన ట్రాఫిక్‌ ఉల్లంఘనల వల్ల పోలీసులు తన మాజీ ప్రియుడికి భారీ జరిమానా విధిస్తారని భావించింది. కానీ, ఆమె వేసిన పన్నాగం అడ్డం తిరిగింది. కారు నడిపించిన ఆమె స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన ప్రియుడిపై పగ తీర్చుకోవడం కోసం సాయం చేయాలని లావ్‌ కోరిందని, అతడి కారును అద్దెకు తీసుకొచ్చి.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పిందని వెల్లడించాడు. దీంతో పోలీసులు లావ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని