World Bank halts aid: అఫ్గాన్‌కు ప్రపంచ బ్యాంకు నిధుల నిలిపివేత..!

తాజా వార్తలు

Published : 25/08/2021 15:10 IST

World Bank halts aid: అఫ్గాన్‌కు ప్రపంచ బ్యాంకు నిధుల నిలిపివేత..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్‌ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు అధికారంలోకి వస్తే.. అఫ్గాన్‌ అభివృద్ధి భవిష్యత్తుపై, మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అఫ్గాన్‌కు చెల్లింపులు నిలిపివేసిన కొన్ని రోజుల్లో ప్రపంచ బ్యాంకు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇది అఫ్గానిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ.

‘‘అఫ్గానిస్థాన్‌లో మా ప్రాజెక్టులకు చెల్లింపులను నిలివేశాం. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఇన్నేళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధిని కాపాడుకొనేందుకు అక్కడ కొనసాగే విషయంపై మా భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నాం. అఫ్గాన్‌ ప్రజలకు మా మద్దతు కొనసాగుతుంది’’ అని ప్రపంచబ్యాంకు ప్రతినిధి పేర్కొన్నారు.

2002 నుంచి ప్రపంచ బ్యాంకు ఇక్కడ 5.3 బిలియన్‌ డాలర్లను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఈ మొత్తంతో అఫ్గాన్‌ పునర్‌ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. కానీ, తాలిబన్ల ఆక్రమణ తర్వాత పనులు నిలిచిపోయాయి. దీంతో తమ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ప్రపంచబ్యాంకు పాకిస్థాన్‌కు తరలించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని