'అతిచిన్న ఆవు'తో ఆ దేశానికి తిప్పలు

తాజా వార్తలు

Published : 10/07/2021 01:08 IST

'అతిచిన్న ఆవు'తో ఆ దేశానికి తిప్పలు

ఢాకా: బంగ్లాదేశ్​లోని ఓ ఆవు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. దానిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఆ ఆవు ప్రపంచంలోనే అతి చిన్నదని దాని యజమాని ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే వారు కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో గుమిగూడుతుండటం ఆందోళనకర విషయం.

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా శివార్లలోని శికోర్​ ఆగ్రో ఫామ్​లో ఉంటుంది రాణి అనే అవు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న (26 అంగుళాల పొడవు) ఆవు అని రాణి యజమాని అంటున్నారు. గిన్నిస్​ బుక్​ రికార్డుల్లో ప్రస్తుతమున్న అతిచిన్న ఆవు కన్నా రాణి 4 అంగుళాలు చిన్నదని పేర్కొంటున్నారు. దీంతో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుల్లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జన్యు లోపాల కారణంగా రాణి ఇలా ఉందని, జీవితాంతం ఇలాగే ఉండిపోయే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ రాణిని చూసేందుకు ప్రజలు తరలివెళుతున్నారు. ఆ చిన్న ఆవుతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. మూడు రోజుల్లో 15వేల మంది సందర్శన కోసం వెళ్లారు. దీంతో ఆ ప్రాంతం కొవిడ్​ హాట్​స్పాట్​గా మారే అవకాశాలు పెరిగిపోయాయి. కరోనా ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు తరలివెళ్లడం ఆందోళనకరం. జూన్​ చివర్లో కరోనా కేసులు, మరణాలు అధికమైన కారణంగా దేశవ్యాప్తంగా కఠినమైన లాక్​డౌన్​ను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. అయినప్పటికీ ప్రజలు ఇలా బయటకు వచ్చి సంచరిస్తుండటం ఆందోళనకరమని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని