ఆందోళన సమయంలో చనిపోయిన రైతుల వివరాలేమీ లేవు!

ప్రధానాంశాలు

Published : 24/07/2021 05:08 IST

ఆందోళన సమయంలో చనిపోయిన రైతుల వివరాలేమీ లేవు!

కేంద్ర మంత్రి తోమర్‌

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సమయంలో చనిపోయిన రైతులకు సంబంధించి వివరాలేమీ ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం పార్లమెంటుకు తెలిపారు. 3 సాగు చట్టాలపై రైతుల మదిలో ఉన్న ఆందోళనలపై ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేపట్టలేదన్నారు. దిల్లీ సరిహద్దుల్లో 2020 నుంచి ఆందోళన చేస్తున్న రైతుల్లో ఎంతమంది చనిపోయారన్న విషయమై ప్రభుత్వానికి ఏమైనా తెలుసా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైతు సంఘాలతో చర్చల్లో.. పిల్లలు, వయోధికులు, మహిళలను ఆందోళన ప్రాంతం నుంచి ఇళ్లకు పంపించాలని ప్రభుత్వం కోరినట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కొవిడ్‌, చలి వాతావరణం వంటి కారణాల వల్ల ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని.. వారి ఆందోళనలను పోగొట్టేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇంతవరకు 11 దఫాలుగా చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్త సాగు చట్టాల రద్దుకు బదులు, వాటిలో ఏ క్లాజుల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారో చెప్పాలని ఈ చర్చల్లో కోరినట్లు మంత్రి తెలిపారు. ఏవైనా అభ్యంతరాలుంటే పరిశీలిస్తామని కూడా చెప్పామన్నారు. అయితే రైతులు మాత్రం ఆ చట్టాల రద్దుకే పట్టుబడుతున్నట్లు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన