జమ్మూలో డ్రోన్‌ కూల్చివేత

ప్రధానాంశాలు

Published : 24/07/2021 05:28 IST

జమ్మూలో డ్రోన్‌ కూల్చివేత

జమ్ము: జమ్మూ-కశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం రేపింది. భారత సరిహద్దులో ఓ డ్రోన్‌ను గుర్తించిన భద్రత దళాలు కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశాయి. కనచక్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం రాత్రి ఓ డ్రోన్‌ సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు యాంటీ-డ్రోన్‌ స్ట్రాటజీ ద్వారా దానిపై కాల్పులు జరిపారు. ఈ డ్రోన్‌ దేశ సరిహద్దును దాటుకుని భారత భూభాగం వైపు దాదాపు 8 కిలోమీటర్ల లోపలకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేసిన అనంతరం డ్రోన్‌ను తనిఖీ చేయగా.. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వీటిని అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబుల తయారీకి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ డ్రోన్‌ పేలుడు పదార్థాలను జారవిడిచేందుకు శుక్రవారం తెల్లవారుజాము ఒంటిగంట సమయంలో తక్కువ ఎత్తులో సంచరించిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. దీన్ని ఆరు రెక్కలతో కూడిన హెక్సాకాప్టర్‌గా గుర్తించామని.. ఇది జీపీఎస్‌, ఫ్లైట్‌ కంట్రోలర్‌ కలిగి ఉందని అడిషనల్‌ డీజీపీ ముఖేష్‌ సింగ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన