మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు..  

కథనాలు

Published : 24/12/2020 12:55 IST

మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు..   

చాహల్‌-ధనశ్రీ చిత్ర మాలిక..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ధనశ్రీ అనే ఓ యూట్యూబర్‌తో మంగళవారం వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని అతడే సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వరకు ఎవరికీ తెలియదు. అయితే, ఈ చూడ ముచ్చటైన జంట ఒక్కటవ్వడానికి ఆగస్టులోనే ముహూర్తం ఖరారైంది. అప్పుడు కూడా చాహల్‌ ఇలాగే సడెన్‌గా‌ ధనశ్రీని పరిచయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో అతడు బిజీకావడంతో అప్పుడప్పుడూ ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు షేర్‌ చేసిన పలు చిత్రాలు మీకోసం..

అవును ఓకే చెప్పాం..

 ధనశ్రీతో తన పెళ్లికి పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని చాహల్‌ ఆగస్టు 8న సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన కాబోయే సతీమణిని అందరికీ పరిచయం చేశాడు. 

స్వాతంత్ర్య దినోత్సవ వేళ..

భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ. కళ్లద్దాలు పెట్టుకొని, తెల్లదుస్తుల్లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

నా మదిని దోచింది నువ్వే..

నా మదిని దోచిన అమ్మాయి నువ్వే అంటూ ధనశ్రీతో అదిరిపోయే సెల్ఫీ తీసుకున్న యూజీ. ఐపీఎల్‌ కోసం యూఏఈ‌కి వెళ్లిన సందర్భంగా హోటల్‌లో తీసుకున్న ఫొటో

నువ్విచ్చిన చిరునవ్వే..

ఐపీఎల్‌ 13వ సీజన్ జరుగుతుండగానే ఓ సందర్భంలో తాము బస చేస్తున్న హోటల్లో సరదాగా మెట్లపై తీసుకున్న చిత్రమిది. 

అనుకోని సెలబ్రేషన్స్‌..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడేటప్పుడు ఓ సందర్భంలో అనుకోకుండా జరుపుకొన్న సెలబ్రేషన్స్‌. మైదానంలో చాహల్‌ బౌలింగ్‌ చేస్తున్న ఆకృతిలో రూపొందించిన కేక్‌తో యువ జంట.

అందమైన సాయం కాలం..

ఓ అందమైన సాయంకాలం సముద్రపు ఒడ్డున ప్రేమ పక్షుల్లా సరదాగా తీసుకున్న చిత్రం. నీవెంటే నేనుంటా అంటూ తన ప్రియసఖితో ప్రేమగా తీసుకున్న సుందర దృశ్యం.

ఐపీఎల్‌ ముగిశాక..

యూఏఈలో ఐపీఎల్‌‌ 13వ సీజన్‌ ముగిశాక ఓ రాత్రివేళ పడవలో తీసుకున్న అందమైన ఫొటో. సముద్రపు జలాల్లో వెనుకవైపు లైట్ల కాంతుల్లో మెరిసిపోతున్న అందమైన కట్టడాల మధ్య చాహల్‌, ధన.

ఎంజాయ్‌ హాలిడే..

ఐపీఎల్‌ పూర్తయ్యాక ఓ హాలిడే సందర్భంగా అల్పాహారం తీసుకుంటున్న చిత్రం. హోటల్‌ గది నుంచి వెనుక వైపు చూస్తే ప్రశాంతమైన సముద్రపు జలాలు. ఇదో ప్రత్యేకమైన ఫొటో. 

ఆహా అనిపించే సెల్ఫీ..

సెల్ఫీ అంటే ఎవరికి ఇష్టముండదు అనేట్లుగా తీసుకున్న స్వీయ చిత్రం. ప్రశాంతమైన సముద్ర జలాల పక్కన తెల్లటి ఇసుక రేణువుల్లో ఆహా అనిపించే తీపిగుర్తు. 

శతమానం భవతి..

బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికి‌.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వేళ. శతమానం భవతి అంటూ అందరూ దీవించే మధుర క్షణాల వేళ తీసిన చిత్రం.

ఇవీ చదవండి..
కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !
2020.. కోహ్లీ ఏంటి?

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన